close

ఫీచర్ పేజీలు

ఆ బుగ్గలిక ఎగరవా?

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ ఎంవీరెడ్డి

కీసర, న్యూస్‌టుడే: వర్షాలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీరెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి సర్పంచులు, ఎంపీడీవోలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాలానుగుణ వ్యాధులు, పారిశుద్ధ్యం, హరితహారం తదితర అంశాలపై కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంచినీటి ట్యాంకులను 15రోజులకోసారి శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా, గ్రామాల్లో వర్షం నీరు నిలవకుండా చూడాలన్నారు. ప్రభుత్వ స్థలాల్లో డంపింగ్‌ యార్డు, ఉద్యానాలు, వైకుంఠధామాలకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 50వేల మొక్కలు నాటాలన్నారు. అనంతరం రహదారుల మరమ్మతులపై ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులతో మాట్లాడారు. సమావేశంలో డీపీఓ రవికుమార్‌, డీఆర్‌డీఏ అధికారి కౌటిల్య పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు