close

ఫీచర్ పేజీలు

పథకాలపై కుదరాలి పట్టు!

కవాడిగూడ, న్యూస్‌టుడే: సినిమా థియేటర్లలో ప్రొజెక్టర్‌ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం రాష్ట్ర కార్మిక కార్యాలయం ముందు తెలంగాణ సినిమా ప్రొజెక్టర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాతలు కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు తీస్తున్నారని, థిÅయేటర్ల ద్వారానే వారికి ఆదాయం సమకూరుతుందన్నారు. కానీ సినిమా చూపించే ప్రొజెక్టర్‌ ఆపరేటర్ల జీత భత్యాలను పట్టించుకునే నాథులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని కోరారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం నెలకు రూ.20 వేలు చెల్లించాలన్నారు. సీఐటీయూ గ్రేటర్‌ అధ్యక్షుడు ఈశ్వర్‌రావు సంఘీభావం తెలిపారు. అసోసియేషన్‌  రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మారన్న, రాష్ట్ర అధ్యక్షుడు పుల్లారావు, కార్యదర్శి అరుణ్‌కుమార్‌, నాయకులు ప్రసాద్‌, మోహన్‌, శ్రీనివాస్‌రెడ్డి, బాలకృష్ణ, సురేశ్‌, రాము, సుధాకర్‌, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు