close

తాజా వార్తలు

మహిళా శాసనసభ్యులపై అసభ్యకర పోస్టులు

నిందితుడి అరెస్టు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో గత నెల 24న ఆరుగురు మహిళా ఎమ్మెల్యేల ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి, అసభ్యకర వ్యాఖ్యలు రాసిన వ్యక్తిని గ్రామీణ గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఏఎస్పీ కె.చక్రవర్తి వివరించారు. ప్రకాశం జిల్లా, చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన పునుగుపాటి రమేష్‌ ఆ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. పోలీసులు తనను అరెస్టు చేయటానికి యత్నిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతనికోసం ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలు సహా నెల్లూరు, కోయంబత్తూరు, సేలం, చెన్నై, బెంగళూరుల్లో గాలించినా ఫలితం లేకపోయింది. న్యాయవాదితో మాట్లాడటానికి నిందితుడు గుంటూరు వస్తున్నాడనే సమాచారంతో రైల్వేస్టేషన్‌ దగ్గర పోలీసులు కాపుకాశారు. మంగళవారం ఉదయం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ విజయకృష్ణ, ఎస్సై గౌతమి, ఏస్సై రామకృష్ణ, హెచ్‌సీ రాజు తమ బృందాలతో రమేష్‌ను అరెస్టు చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు