close

తాజా వార్తలు

రన్‌వేపైకి కుక్కలు.. తప్పిన ప్రమాదం

పణజీ: గోవా డైబోలిమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం పెనుప్రమాదం తప్పింది. ముంబయి నుంచి వస్తున్న ఎయిరిండియా విమానం దిగడానికి కొన్ని క్షణాల ముందు వీధి కుక్కలు రన్‌వే పైకి వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌ ట్రాఫిక్‌ సిబ్బంది విమానం ల్యాండింగ్‌కి ఇచ్చిన అనుమతుల్ని చివరి క్షణంలో రద్దు చేశారు. ఈ విమానాశ్రయం పరిధిలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ భారత నేవీ నియంత్రణలో ఉంటుంది. తొలుత రన్‌వేపై చీకటిగా ఉండడంతో కుక్కలు కనిపించలేదని.. ల్యాండింగ్‌కి అనుమతులు ఇచ్చేశామని తెలిపారు. అనంతరం కొద్ది సేపటికి అవి లోపలికి చొచ్చుకొని రావడంతో కనిపెట్టగలిగామన్నారు. వెంటనే పైలట్‌కి సమాచారం అందించి విమానం దిగకుండా చూశామన్నారు. కాసేపటి తర్వాత రన్‌వేపై నుంచి కుక్కల్ని పారదోలడంతో విమానం జాగ్రత్తగా ల్యాండ్ అయిందని తెలిపారు.

దీనిపై నేవీ అధికారులు స్పందిస్తూ.. కుక్కల బెడదను నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. అలాగే విమానాశ్రయ సమీప ప్రాంతాల్లోని కుక్కలని స్టెరిలైజ్‌ చేసి ఇతర ప్రాంతాలకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు