close

తాజా వార్తలు

రివాల్వర్‌తో కాల్చుకుని డీసీపీ ఆత్మహత్య

ఫరీదాబాద్‌: హరియాణలోని ఫరీదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫరీదాబాద్‌ పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయాన్నే ఆయన తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈయన మృతిపై ఫరీదాబాద్‌ ప్రజా సంబంధాల అధికారి సూబే సింగ్‌ మాట్లాడారు. 

‘ఫరీదాబాద్‌ ఎన్‌ఐటీ డీసీపీ విక్రమ్‌ కపూర్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని సెక్టార్‌ 30 పోలీస్‌ లేన్స్‌లోని తన నివాసంలో ఉదయం 6గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పడానికి చింతిస్తున్నాం. మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది’ అని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు