close

తాజా వార్తలు

ప్రతి మ్యాచ్‌ నాకు కీలకమే: పంత్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: జట్టుకు విజయాలు అందించడానికి కృషి చేస్తానని, ప్రతి మ్యాచ్‌ తనకి ఎంతో కీలకమని భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. ‘వ్యక్తిగతంగా నేను భారీ స్కోరు సాధించాలని కోరుకుంటాను. కానీ ఆ ఉద్దేశంతోనే ఎల్లప్పుడూ బరిలోకి దిగను. కేవలం పాజిటివ్‌ క్రికెట్‌ ఆడటానికి ప్రయత్నిస్తుంటాను. జట్టుకు విజయాలు అందించడానికి కృషి చేస్తాను. ప్రతి మ్యాచ్‌ నాకు ఎంతో కీలకం. నా ఆటను మరింత మెరుగుపర్చుకోడానకి ప్రయత్నిస్తున్నాను’ అని మీడియాతో పంత్‌ పేర్కొన్నాడు.

‘ప్రస్తుతం అందరూ ప్రశాంతగా ఉన్నారు. మ్యాచ్‌ గురించే మేం ఆలోచిస్తున్నాం. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాం. రెండో వన్డేలో మేం పైచేయి సాధించాం. అదేవిధంగా రాణిస్తే తప్పకుండా ఆఖరి పోరులోనూ విజయం సాధిస్తాం. ప్రయోగాలు చేయాలని జట్టు భావించట్లేదు. అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో జట్టు యాజమాన్యం మంచి ప్రోత్సాహం ఇస్తోంది. అందరికీ అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నా’ అని తెలిపాడు. 

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న పంత్‌కు శ్రేయస్ అయ్యర్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. భారత్‌, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో పంత్‌ 20 పరుగులకే ఔటవ్వగా శ్రేయస్‌ 71 పరుగులతో రాణించాడు. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా ఆఖరి మ్యాచ్‌లో 65 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు