close

తాజా వార్తలు

కశ్మీర్‌ విభజనపై తక్షణ సమావేశం జరిపించండి

ఐరాసకు లేఖ రాసిన పాక్‌

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు, విభజన ఘటనల్ని పాకిస్థాన్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. అంతేకాకుండా భారత్‌ మీద అక్కసు పెంచుకుంటోంది. కశ్మీర్‌ మీద ఆశచావక రోజుకో దేశాన్ని మద్దతు కోసం ఆశ్రయిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ ఐరాసను ఆశ్రయించింది. జమ్మూకశ్మీర్‌ అంశంపై భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అత్యవసర సమావేశాన్ని జరిపించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)కి లేఖరాసింది. ఓ మీడియా రాసిన కథనం ప్రకారం... పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ యూఎన్‌ఎస్‌సీ అధ్యక్షుడు జొవాన్న రొనెక్కాకు లేఖ రాశారు. 

‘భారత్‌ తీసుకుంటున్న చర్యల వల్ల అంతర్జాతీయ సమాజంలో శాంతికి విఘాతం కలుగుతోంది. ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాలని కోరుకుంటున్నాం. మా నిగ్రహాన్ని చేతగానితనంగా భారత్‌ భావిస్తోంది’ అని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై 15సభ్యుల కమిటీ ఎలా స్పందిస్తుందో తెలియరాలేదు. అయితే దీనిపై పోలాండ్‌ విదేశీ మంత్రి జాసెక్‌ జాపుటోవిజ్‌ స్పందించారు. పాక్‌ నుంచి ఐరాసకు లేఖ అందిందని, దానిపై చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు