close

తాజా వార్తలు

కాల్వలోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు

తాడ్వాయి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి శివారులో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు కాల్వలోకి  దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తుండగా.. మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు ఓ వైపు ఒరిగిపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాతకాలం నాటి బస్సును వినియోగిస్తున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు