close

తాజా వార్తలు

మేకప్‌ ఆర్టిస్టుగా మారిన అక్షయ్‌కుమార్‌..!

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ మేకప్‌ ఆర్టిస్టుగా సరికొత్త అవతారమెత్తారు. ప్రస్తుతం ‘మిషన్‌ మంగళ్‌’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న అక్షయ్‌ ఆ చిత్రంలో తనతోపాటు నటించిన సోనాక్షి సిన్హాకు మేకప్‌ వేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. అక్షయ్‌ తనకు మేకప్‌ వేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘నాకు తక్కువ ఖర్చులో మేకప్‌ ఆర్టిస్టు దొరికాడు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 
‘మిషన్‌ మంగళ్‌’ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా కోసం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్‌, సోనాక్షితోపాటు విద్యా బాలన్‌‌, తాప్సీ, నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరి, శర్మన్‌ జోషిలు నటించారు. ఇటీవల వీరంతా కలసి సరదాగా అంత్యాక్షరి ఆడిన వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు