close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 1PM

1. ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉద్ధృతి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఆరడుగుల మేర ఎత్తి దిగువకు 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 12 అడుగులుగా ఉంది. బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో లంక గ్రామాల్లో పరిస్థితులను అధికారులు సమీక్షిస్తున్నారు. బ్యారేజీ దిగువన తోట్లవల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో పొలాలు మునిగిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రేపు అభినందన్‌కు వీర్‌చక్ర ప్రదానం

శత్రు సైనికుల చెరలో ఉన్నా.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు రేపు ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును అందించనున్నారు. ఆయనతో పాటు ఐఏఎఫ్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌కు యుద్ధసేవా పతకాన్ని ప్రదానం చేయనున్నారు. పలువురు జవాన్లకు శౌర్యచక్ర, కీర్తిచక్ర అవార్డులను కూడా అందించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అత్తివరదరాజస్వామి సన్నిధిలో రజనీకాంత్‌

తమిళనాడులోని కాంచీపురంలో గల అత్తివరదరాజస్వామిని ప్రముఖ నటుడు రజనీకాంత్‌ దర్శించుకున్నారు. ఈ ఉదయం కుటుంబసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, వేదపండితులు సాదరస్వాగతం పలికారు. అనంతరం రజనీ దంపతులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. వారం క్రితం రజనీ భార్య లత ఒక్కరే ఆలయానికి రాగా.. ఇప్పుడు దంపతులిద్దరూ వచ్చి స్వామిని దర్శించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 16న టీమిండియా కోచ్‌ ప్రకటన!

టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపిక ఫలితాలను బీసీసీఐ శుక్రవారమే ప్రకటించనుందని తెలుస్తోంది. కపిల్‌ నేతృత్వంలోని కమిటీ కోచ్‌ పదవి కోసం శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కపిల్‌దేవ్‌, అన్షుమన్ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ భారత ప్రధాన కోచ్ ఎంపికను చేపట్టింది. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను మాత్రమే కపిల్‌ కమిటీ ఇంటర్వ్యూలకు పిలవనుంది. అయితే అదే రోజు కోచ్‌ ఫలితాలు కూడా ప్రకటిస్తారని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కశ్మీర్‌ విభజనపై తక్షణ సమావేశం జరిపించండి

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు, విభజన ఘటనల్ని పాకిస్థాన్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. అంతేకాకుండా భారత్‌ మీద అక్కసు పెంచుకుంటోంది. కశ్మీర్‌ మీద ఆశచావక రోజుకో దేశాన్ని మద్దతు కోసం ఆశ్రయిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ ఐరాసను ఆశ్రయించింది. జమ్మూకశ్మీర్‌ అంశంపై భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అత్యవసర సమావేశాన్ని జరిపించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)కి లేఖరాసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమైన దిల్లీ

7. మతాన్ని నిరూపించుకోవడం కంటే చావడం మేలు

తన మతాన్ని నిరూపించుకోవాల్సి వస్తే ప్రాణాలు సైతం తీసుకోవడానికి వెనుకాడనని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మంగళవారం ఓ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె పేరు ప్రస్తావించకుండా భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దుర్గా మాతకు పూజలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆమె కాస్త భావోద్వేగంతో ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

గతంలో వనస్థలిపురంలో చోటుచేసుకున్న ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన రాంజీనగర్‌ ముఠాను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థ సిబ్బంది దృష్టి మరల్చి దుండగులు సుమారు రూ.70 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ చోరీకి పాల్పడింది రాంజీ ముఠానేనని తేల్చి దాదాపు నాలుగు నెలల పాటు గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దోపిడీకి ఉపయోగించిన వాహనంతో పాటు.. సుమారు 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అత్తివరదరాజస్వామిని దర్శించుకున్న రజనీకాంత్‌

10. కాల్వలోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి శివారులో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు కాల్వలోకి  దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తుండగా.. మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు ఓ వైపు ఒరిగిపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు