close

తాజా వార్తలు

గేల్‌ సరసన భువి

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: కరీబియన్‌ దీవుల్లో బంతిని రెండువైపులా స్వింగ్‌ చేస్తూ విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్న టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్‌ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో వన్డేలో భువి 31 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌తో సమానంగా నిలిచాడు. విండీస్‌ దిగ్గజం కోర్ట్‌లీ అంబ్రోస్ 24 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. వెస్టిండీస్ బౌలర్లు మెర్విన్ డిల్లాన్, క్రిస్‌ గేల్‌, భువనేశ్వర్‌ తలో 15 వికెట్లు తీసి తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-5లో ఉన్న వెస్టిండీస్‌కు చెందని ఆటగాడు భువీ మాత్రమే. పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే మూడో వన్డేలో భువి మరో వికెట్‌ పడగొడితే రెండో స్థానంలో నిలుస్తాడు. విండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్ వర్షర్పారణం కాగా రెండో వన్డేలో కోహ్లీసేన 59 పరుగుల తేడాతో గెలిచింది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు