close

తాజా వార్తలు

ఇరాన్‌ జిమ్‌లో పోకిరి పాట..

దినచర్యలో భాగం చేసుకుంటా: ఆనంద్‌ మహీంద్రా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసక్తికరమైన లేదా సరదా విషయాలను ట్విటర్‌లో నెటిజన్లతో పంచుకోవడంలో మహీంద్ర అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ముందుంటారు. ట్విటర్‌లో వైరల్‌ అవుతున్న ఓ సరదా వీడియోకు బుధవారం ఆయన రీట్వీట్‌ చేశారు. ఇరాన్‌లోని ఓ జిమ్‌లో తమిళ పోకిరి చిత్రంలోని పాటను వార్మ్‌అప్‌ కోసం ప్లే చేశారు. దానికి ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్‌ చేస్తూ.. ‘‘మీరు సీరియస్‌గా ఉంటారా? ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. దీన్ని రోజూ దినచర్యలో భాగం చేసుకుంటాను. నిద్ర లేచాక తమిళ సంగీతం విని ఉత్సాహంతో రోజు మొదలు పెడతాను.’’ అని స్పందించారు. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేసిన కొద్ది గంటల్లోనే దీనికి వేలాది లైక్‌లు వచ్చాయి. ఎంతో మంది రీట్వీట్‌ కూడా చేశారు. 
అయితే, ఇరాన్‌లోని ఓ జిమ్‌లో తమిళ పోకిరి చిత్రంలోని పాటను ప్లే చేసినప్పుడు యువత ఉత్సాహంగా నృత్యం చేయడం ఆకట్టుకుంది.



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు