close

తాజా వార్తలు

బంగారు ఉంగరాలు బహూకరించిన హీరో

సోషల్‌మీడియాలో ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: తమిళ హీరో, ఇళయపతి విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బిగిల్‌’. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం విజయ్‌ అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చివరిదశ చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో విజయ్‌ ఇటీవల తన షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ ఈ సినిమా కోసం కష్టపడిన 400 మంది నటులు, టెక్నీషియన్స్‌కు బంగారు ఉంగరాలను అందించారు. అంతేకాకుండా తన ఆటోగ్రాఫ్‌తో కూడిన ఫుట్‌బాల్స్‌ను సైతం బహూకరించారు. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ తండ్రి, కుమారుడి పాత్రల్లో కనిపించనున్నారు. 

ఒక గ్యాంగ్‌స్టార్‌, మహిళ ఫుట్‌బాల్‌ కోచ్‌గా విజయ్‌ కనిపించనున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత సమకూర్చుతున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు