close

తాజా వార్తలు

వాళ్లు కృష్ణార్జునులైతే..పాండవులు ఎవరు?

రజనీకాంత్‌పై ఒవైసీ విమర్శ

హైదరాబాద్‌: సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో ప్రధాని మోదీ- కేంద్ర మంత్రి అమిత్‌ షా కృష్ణార్జునుల్లా వ్యవహరించారని రజనీ కాంత్‌ ప్రశంసించిన విషయం తెలిసిందే. దీనిపై ఒవైసీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా కృష్ణార్జునులంటూ రజనీకాంత్‌ ప్రశంసించారు.. అయితే ఇక్కడ పాండవులు, కౌరవులు ఎవరు? దేశంలో మరో మహాభారతం కావాలని మీరు అనుకుంటున్నారా?’ అంటూ విమర్శల వర్షం కురిపించారు.

‘లిజనింగ్‌..లెర్నింగ్‌..లీడింగ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజనీ పాల్గొని మాట్లాడారు. ‘మిషన్‌ కశ్మీర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్లమెంటులో అమిత్‌షా ప్రసంగం అద్భుతం. అమిత్‌ షా- మోదీ ఇద్దరూ కృష్ణార్జున కాంబినేషన్‌లాంటి వారు. ఎవరెలాంటి వారో వారికి మాత్రమే తెలుసు. మీకంతా శుభాలే కలగాలి’ అని అన్నారు. వెంకయ్య గురించి మాట్లాడుతూ..‘ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తుంటారు. ఆయనో గొప్ప ఆధ్యాత్మిక వేత్త’ అని కొనియాడారు. రజనీ వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్‌ మండిపడింది. మహాభారతాన్ని మరోసారి చదువుకోవాలంటూ చురకలు అంటించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు