close

తాజా వార్తలు

తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే: తలసాని

హైదరాబాద్‌: రాష్ట్రంలో తెరాసకు ఎప్పటికైనా కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిలో భాజపాపై మరోసారి మండిపడ్డారు. కాలం చెల్లిన నేతల చేరికతో భాజపాకు ఒరిగేదేమీ లేదన్నారు. కేడర్‌ లేకుండా కేవలం నాయకులు చేరినంత మాత్రాన ఆ పార్టీ బలపడదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఉన్నంత ఓటుబ్యాంకు భాజపాకు లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పలుకుబడి పురపాలక ఎన్నికల్లో పనికిరాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేస్తారనేది ఊహాగానాలు మాత్రమేనని తలసాని స్పష్టంచేశారు. ఆర్టికల్‌ 370 రద్దుపై పార్లమెంట్‌లో తెరాస ఎంపీలు మద్దతు తెలిపారని.. తన కుమారుడు సాయికిరణ్‌కు మేయర్‌ పదవి అడిగినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమన్న భాజపా ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఎందుకు ఇవ్వడంలేదని భాజపాను తలసాని నిలదీశారు.మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు