close

తాజా వార్తలు

నామినేషన్లు దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు

అమరావతి: ఏపీ శాసన మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలకు వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా  మంత్రి మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి తమ నామినేషన్లను సమర్పించారు. అసెంబ్లీ కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.బాలకృష్ణమాచార్యులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మూడు శాసన మండలి స్థానాల భర్తీకి ఈనెల 7న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ్టితో గడువు ముగుస్తుండటంతో ఈ ముగ్గురు తమ నామపత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. ఈనెల 16న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈనెల 19న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. 26న ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయటంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశముంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు