close

తాజా వార్తలు

రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి:భట్టి

హైదరాబాద్‌: తెలంగాణలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జ్వరాల బారినపడుతున్నారని.. రాష్ట్రం రోగాల తెలంగాణగా మారిందని ఆయన  ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంలేదని ఆరోపించారు. ఈ నెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్ర ఆసుపత్రులను సందర్శిస్తామని ఈ సందర్భంగా భట్టి వెల్లడించారు. తాము ఆరోగ్య సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం తమపై విమర్శలు చేస్తోందని ఆక్షేపించారు. నీలోఫర్ ఆసుపత్రి సందర్శించి వైద్య సౌకర్యాలు సరిగ్గాలేవని గతంలో ప్రభుత్వానికి చెప్పామని.. అయినా పట్టించుకోలేదని ఆరోపించారు.

 



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు