close

తాజా వార్తలు

గుజరాత్‌ మీదుగా ఉగ్ర చొరబాట్లకు అవకాశం

ఆ రాష్ట్ర పోలీసులకు నిఘావర్గాల హెచ్చరిక 

దిల్లీ: పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి జమ్ము కశ్మీర్‌లో దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, గుజరాత్‌ మీదుగా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశముందని తాజాగా నిఘా అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గుజరాత్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో తీర, సరిహద్దు రక్షక పోలీసులను సరిహద్దుల్లో మోహరించారు. 
ఉగ్ర ముప్పు గురించి కచ్‌ ప్రాంతంలోని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశామని కచ్‌ తూర్పు ప్రాంత పోలీస్‌ సూపరింటెండెంట్‌ పరీక్షిత రాఠోడ్‌ తెలిపారు. సముద్రంలో అనుమానాస్పద పడవల కదలికలు ఉంటే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించినట్లు వెల్లడించారు. నిఘా వర్గాల హెచ్చరికలతో ఎటువంటి చొరబాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. సరిహద్దు, తీర రక్షక పోలీసులను మోహరించినట్లు ఆమె వివరించారు.
నిఘా వర్గాల అంచనాల ప్రకారం.. భారత సైన్యం లక్ష్యంగా పాక్‌ నిర్దేశిత ఉగ్రవాదులతో దాడులు జరిపి, ఆ నెపాన్ని జమ్ము కశ్మీర్‌లోని స్థానికులపై నెట్టాలని యోచిస్తున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో ఈ ఆకృత్యాలు జరిగే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. అయితే, కశ్మీర్‌ నిర్ణయంపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాక్‌ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం భారత అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజం విశ్వసించడంతో పాక్‌ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ ఉగ్రదాడులకు పాల్పడే అవకాశముందని తెలుస్తోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు