close

తాజా వార్తలు

డిపాజిట్‌ రేట్లు సవరించిన ఐసీఐసీఐ

ముంబయి: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను సవరించింది. తాజా వడ్డీరేట్లు నేటి (ఆగస్టు 14) నుంచే అమల్లోకి రానున్నాయి. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల వరుసగా నాలుగోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో ఐసీఐసీఐ వడ్డీ రేట్లను సవరించింది.  ఏడు రోజుల నుంచి పదేళ్ల  కాలావధి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించింది. ఇప్పటికే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులు వడ్డీరేట్లను ఈ నెలలోనే సవరించాయి.

కాలపరిమితి     వడ్డీరేటు
7 నుంచి 14 రోజుల వరకు 4శాతం
15 నుంచి 29 రోజుల వరకు 4.25 శాతం
30 నుంచి 45 రోజుల వరకు 5.25 శాతం
46 నుంచి 60 రోజుల వరకు 5.75 శాతం 
61 నుంచి 90 రోజుల వరకు 5.75 శాతం
91 నుంచి 120 రోజుల వరకు  5.75 శాతం
185 నుంచి 289 రోజుల వరకు  6.25 శాతం
290 రోజుల నుంచి ఏడాది వరకు 6.50 శాతం
1 ఏడాది నుంచి 389 రోజుల వరకు 6.70 శాతం
390 రోజుల నుంచి 18 నెలల వరకు 6.80 శాతం
18 నెలల నుంచి 2 ఏళ్ల వరకు 7.10 శాతం
2 ఏళ్ల 1 రోజు నుంచి 3 ఏళ్ల వరకు 7.10 శాతం
3 ఏళ్ల 1 రోజు నుంచి 5 ఏళ్ల వరకు 7శాతం
5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 7 శాతం

*సీనియర్‌ సిటిజన్లకు చెల్లించే వడ్డీరేట్లు ఈ శాతాలకు 50 బేసిస్‌ పాయింట్లు అదనం


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు