close

తాజా వార్తలు

విదేశాలకు వెళ్తుండగా షా ఫైజల్‌ అడ్డగింత

దిల్లీ: సివిల్‌ సర్వీసును వీడి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఐఏఎస్‌ టాపర్‌ షా ఫైజల్‌ను దిల్లీ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఫైజల్‌ను పోలీసులు అడ్డుకుని తిరిగి శ్రీనగర్‌ తీసుకెళ్లారు. అక్కడ గృహనిర్బంధంలో ఉంచారు. ఫైజల్‌ ఇస్తాంబుల్‌ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

ఐఏఎస్‌ పరీక్షల్లో టాప్‌ ర్యాంక్‌ సాధించిన తొలి కశ్మీరీగా గుర్తింపు పొందిన ఫైజల్‌.. ఈ ఏడాది జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. జమ్ముకశ్మీర్‌ పీపుల్స్‌ మూమెంట్‌ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుపై గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారు. నిన్న కూడా ఓ ట్వీట్‌ చేశారు. ‘కశ్మీర్‌లో రాజకీయ హక్కులను పునరుద్ధరించేందుకు ఓ స్థిరమైన, సుదీర్ఘమైన, అహింసతో కూడిన రాజకీయ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్‌ 370 రద్దుతో ప్రధాన రాజకీయ నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. రాజకీయవాదులు వెళ్లిపోయారు. అందువల్ల ఇప్పుడు ఒకరి కింద అన్నా బతకాలి లేదా  ప్రత్యేకంగా అయినా ఉండాలి’ అని ఫైజల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు