close

తాజా వార్తలు

వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయం

తిరువనంతపురం: కేరళలో వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం కింది రూ.10వేలు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. బుధవారం నిర్వహించిన వారాంతపు కేబినెట్‌ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వరదల కారణంగా వచ్చిన నష్టం తక్కువేనన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 95 మంది మృతి చెందగా, 1.89 లక్షల ప్రజానీకం ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1,118 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని తెలిపారు. కొండచరియలు విరిగి పడటంతోనే ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. గత సంవత్సరం జరిగిన విపత్తుతో నష్టపోయిన కేరళను పునర్నిర్మించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సమయంలోనే మళ్లీ వరదలు సంభవించడం దురదృష్టకరమని విజయన్‌ అన్నారు.

ఇల్లు, భూమి కోల్పోయిన వారికి రూ.10 లక్షలు
ప్రతి వరద బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద పదివేల రూపాయలతో పాటు భూనిర్వాసితులకు ఆరు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని విజయన్‌ ప్రకటించారు. అలానే ఇల్లు కోల్పోయిన వారికి రూ.4 లక్షలు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. రెండూ (భూమి, గృహం) కోల్పోయిన వారికి ప్రతిఫలంగా రూ.10 లక్షలు అందజేస్తాం అని వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు