close

తాజా వార్తలు

బ్యాటింగ్‌పై ఆలోచనా విధానం రీప్రోగ్రామింగ్‌ చేసుకోవాలి

పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌: బ్యాటింగ్‌లో తిరిగి ఫామ్‌ అందుకొనేందుకు తన ఆలోచనల్ని రీ ప్రోగ్రామింగ్‌ చేసుకుంటున్నానని వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ అంటున్నాడు. ఫిట్‌నెస్‌ అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నాని వెల్లడించాడు. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీసుల్లో అతడు 9, 10, 0 పరుగులే చేసిన సంగతి తెలిసిందే.

‘బ్యాటింగ్‌ పరంగా చూస్తే నా ఆలోచనా విధానాన్ని రీ ప్రోగ్రామింగ్‌ చేసుకోవాలి. బంతిని సరిగ్గా స్వీప్‌ చేయాలి. పక్కాగా బాదాలి. బ్యాటింగ్‌ నిలకడగా చేయాలి. కోచ్‌లు, సహాయ సిబ్బందితో నిజాయతీగా సంభాషిస్తున్నా. 12-14 నెలలుగా ఫిట్‌నెస్‌పై కఠోరంగా శ్రమిస్తున్నా. దృఢంగా తయారవుతున్నా. బ్యాటింగ్‌ చేసేందుకు తగిన సమయం దొరుకుతోంది. నా ఆలోచనా విధానం సవ్యంగా ఉంది. ఎక్కువ సమయం క్రీజులో గడపాలని కోరుకుంటున్నా. టీమిండియాపై స్వదేశంలో మా జట్టు కూర్పు మారింది. నేను ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఆడుతున్నా. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ఎలా శతకం చేశానో ఇక్కడా ఇలాగే ఆడాలని భావిస్తున్నా’ అని బ్రాత్‌వైట్‌ అన్నాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు