close

తాజా వార్తలు

మార్కెట్లకు మళ్లీ లాభాల కళ

ముంబయి: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులతో నిన్న అమాంతం కుప్పకూలిన దేశీయ మార్కెట్లు బుధవారం కోలుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ లాంటి దిగ్గజ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. ఫలితంగా నేటి సెషన్లో సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. 

కొనుగోళ్ల అండతో ఈ ఉదయం నుంచి సూచీలు లాభాల్లో సాగాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌.. ఒక దశలో 460 పాయింట్లకు పైగా ఎగబాకి రోజు గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయింది. చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో గరిష్ఠాల నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 353 పాయింట్లు లాభపడి 37,311 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 11,029 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.27గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో యూపీఎల్‌ లిమిటెడ్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, వేదాంత లిమిటెడ్‌, టాటాస్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ షేర్లు లాభపడగా.. సన్‌ఫార్మా, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా లోహ, మౌలిక, బ్యాంకింగ్‌, ఎనర్జీ, ఐటీ షేర్లు రాణించాయి. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు