close

తాజా వార్తలు

పంట రుణాల చెల్లింపు గడువు పెంచండి

ఆర్‌బీఐకి రాహుల్‌ గాంధీ లేఖ

దిల్లీ: గతేడాది కేరళను వరదలు ముంచెత్తడంతో రైతులు బ్యాంకులకు చెల్లించే పంట రుణాల గడువు తేదీని ఈ ఏడాది చివరి వరకూ పొడిగించాలని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆర్‌బీఐని కోరారు. ఈ మేరకు బుధవారం రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు రాహుల్‌ లేఖ రాశారు. శతాబ్ద కాలంలో ఎప్పుడూ చూడని వరదలతో కేరళ ప్రజలు బాగా నష్టపోయారని, పంటలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయని వివరించారు. దీనికి తోడు మద్దతు ధరలు పడిపోవడం వంటి పరిణామాలు కోలుకోలేని దెబ్బతీశాయని వెల్లడించారు. పంట రుణాల వసూలు కోసం నిస్సహాయులైన అన్నదాతలపై బ్యాంకులు ఒత్తిడి తెస్తే రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరిగే అవకాశముందని అన్నారు. 

రుణాల చెల్లింపు గడువును పెంచాలనే ఈ అభ్యర్థన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు చేసినప్పటికీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఇందుకు నిరాకరించిందని రాహుల్‌ వివరించారు. రుణాల చెల్లింపు గడువు పెంచేలా ఆర్‌బీఐ చొరవ చూపాలని రాహుల్‌ కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు