close

తాజా వార్తలు

ఆ హోటళ్లకు నోటీసులు పంపండి: పాసవాన్‌

దిల్లీ: గత కొద్దిరోజులుగా నెట్టింట్లో వైరల్‌ అవుతున్న రెండు అరటిపండ్లు, కోడి గుడ్ల అధిక ధరలపై కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అధిక ధరలతో వినియోగదారులను అసహనానికి గురి చేసిన హోటళ్లకు నోటీసులు పంపి వివరణ తీసుకోమని మంగళవారం తమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రెండు అరటిపండ్లకు రూ.442 చెల్లించిన బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌ వివాదాన్ని, రెండు కోడి గుడ్లకు రూ.1700 ఘటనలపై మంత్రి ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా బాధాకరం అన్నారు. ఇది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమని, ఈ రెండు ఘటనలపై ఆయా హోటళ్లకు నోటీసులు జారీ చేసి వివరణ కోరమని తమ శాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.  

బాలీవుడ్‌ నటుడు రాహుల్‌బోస్‌ షూటింగ్‌లో భాగంగా ఛండీగఢ్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు. రెండు అరటిపండ్లు తీసుకురమ్మని హోటల్‌ సిబ్బందిని కోరారు. అరటి పండ్లు తెచ్చిన సిబ్బంది రూ.442 బిల్లు చేతిలో పెట్టే సరికి ఆశ్చర్యపోయి అరటిపండ్లు ఆరోగ్యానికి హానికరం అంటూ ఫొటోతో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా కార్తీక్‌ అనే వ్యక్తి ముంబయిలో ఓ హోటల్‌లో బస చేసి రెండు కోడి గుడ్లు ఆర్డర్‌ చేశాడు. వాటికి హోటల్‌ సిబ్బంది రూ.1700 వసూలు చేశారు. దీంతో అతడు కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ రెండు ఘటనలూ నెట్టింట్లో తీవ్ర దుమారాన్ని రేపిన నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజాగా ఆ ఘటనలపై వివరణ కోరాలని అధికారులను ఆదేశించారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు