close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. జమ్ములో ఆంక్షల ఎత్తివేత

అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విధించిన ఆంక్షల్ని జమ్ము ప్రాంతంలో పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్‌ అదనపు డీజీపీ మునీర్‌ ఖాన్‌ తెలిపారు. కశ్మీర్‌లో మాత్రం మరికొన్ని రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించనున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రెవెన్యూ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు సంతృప్తికర స్థాయిలో మంజూరు చేసేలా ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి:భట్టి

తెలంగాణలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జ్వరాల బారినపడుతున్నారని.. రాష్ట్రం రోగాల తెలంగాణగా మారిందని ఆయన  ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంలేదని ఆరోపించారు. ఈ నెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్ర ఆసుపత్రులను సందర్శిస్తామని ఈ సందర్భంగా భట్టి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. గుజరాత్‌ మీదుగా ఉగ్ర చొరబాట్లకు అవకాశం

పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి జమ్ము కశ్మీర్‌లో దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, గుజరాత్‌ మీదుగా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశముందని తాజాగా నిఘా అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గుజరాత్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో తీర, సరిహద్దు రక్షక పోలీసులను సరిహద్దుల్లో మోహరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సైరా మేకింగ్‌ వీడియో... అదుర్స్‌ కదా!

6. ‘హైదరాబాద్‌ యూటీనా?అవన్నీ ఊహాగానాలే’

రాష్ట్రంలో తెరాసకు ఎప్పటికైనా కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిలో భాజపాపై మరోసారి మండిపడ్డారు. కాలం చెల్లిన నేతల చేరికతో భాజపాకు ఒరిగేదేమీ లేదన్నారు. కేడర్‌ లేకుండా కేవలం నాయకులు చేరినంత మాత్రాన ఆ పార్టీ బలపడదన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేస్తారనేది ఊహాగానాలు మాత్రమేనని తలసాని స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మాలిక్‌జీ.. ఎప్పుడు రమ్మంటారు: రాహుల్‌

కశ్మీర్‌లో పర్యటించేందుకు తాను సిద్ధమని.. ఎప్పుడు రమ్మంటారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌ను ప్రశ్నించారు. గవర్నర్‌ కోరినట్లుగా ఎలాంటి షరతులు లేకుండా అక్కడి ప్రజల్ని, నాయకుల్ని కలిసేందుకు తనకు సమ్మతమేనన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని.. అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు వివరించాలని రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి కోరిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. షాక్‌: సోషల్‌ మీడియాలో మహిళా క్రికెటర్‌ నగ్నచిత్రం

ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ సంచలనం సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన నగ్న చిత్రాన్ని పంచుకుంది. దుస్తులేమీ లేకుండా వికెట్‌ కీపింగ్‌ చేస్తున్న చిత్రం పోస్ట్‌ చేసింది. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఆమె ఎవరూ చేయని సాహసం చేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఫిల్మ్‌సిటీలో ‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుక

ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహించారు. ప్రభాస్‌ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, చిత్ర బృదం అభిమానులకు ఓ శుభవార్త వినిపించిది. ‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుకను ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రామోజీఫిల్మ్‌ సిటీ ప్రాంగణంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మార్కెట్లకు మళ్లీ లాభాల కళ

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులతో నిన్న అమాంతం కుప్పకూలిన దేశీయ మార్కెట్లు బుధవారం కోలుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ లాంటి దిగ్గజ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్‌ 353 పాయింట్లు లాభపడి 37,311 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 11,029 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.27గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు