close

తాజా వార్తలు

హిందువుల నమ్మకాన్నే కోర్టు పరిగణించాలి


 

దిల్లీ: ‘హేతుబద్ధత చూసేందుకు అత్యున్నత న్యాయస్థానం హిందూ ప్రజల నమ్మకాలను పరిగణనలోకి తీసుకోవాలి. అయోధ్య రాముని జన్మ స్థలం. దీన్ని ప్రతి హిందువు నమ్ముతాడు’ అని రామ్‌ లల్లా విరజ్‌మాన్‌ కౌన్సిల్‌ బుధవారం  కోర్టు ముందు తమ వాదనలు వినిపించింది. అయోధ్యలోని రామజన్మ భూమి- బాబ్రీ మసీదు వివాదంపై వరుసగా ఆరో రోజు విచారణ కొనసాగింది.రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ బోర్డు తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది సీ.ఎస్‌ వైద్యనాథన్‌ ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. 

చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వం వహిస్తున్న రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఏస్‌.ఏ.బొబ్డే, డీ.వై.చంద్రచూడ్‌, అశోక్‌ భూషణ్‌, ఏస్‌.ఏ.నజీర్‌లు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ‘2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రెండు భాగాలుగా విభజిస్తే వివాదాలకు దారి తీస్తుంది. ఇది రామజన్మస్థలం, ఈ ప్రదేశం తమది అని వాదించే హక్కు ముస్లింలకు ఏ మాత్రంలేదని’ వైద్యనాథన్‌ మంగళవారం కోర్టుకు విన్నవించుకున్నారు. ‘ఇప్పటివరకు ఇరు వర్గాలకు చెందిన ప్రదేశంగా ఉన్న ఈ భూమిని... ఇప్పుడు కేవలం తమకు చెందిన స్థలంగా భావించాలి. ముస్లింలకు ఎలాంటి హక్కు లేదని ఏవిధంగా వాదిస్తారు’ అని రామ్‌లల్లా బోర్డును ధర్మాసనం ప్రశ్నించింది.

ధర్మాసనం అడిగిన ప్రశ్నకు సమాధానంగా అయోధ్య రాముడు పుట్టిన పవిత్ర ప్రదేశం అనేది హిందువుల నమ్మకం. ఆ విషయన్నే కోర్టు పరిశీలించాలని రామ్‌లల్లా బోర్టు ఈరోజు తమ వాదనలను అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.2.77 ఎకరాల వివాదాస్పద భూమిని హిందువులకు చెందిన నిర్మొహి అఖారా, రామ్‌లల్లా బోర్డులకు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్‌ బోర్డుకు సమానంగా పంచాలంటూ 2010లో అలహాబాద్‌ కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా 14 అప్పీళ్లు నమోదవడం గమనార్హం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు