close

తాజా వార్తలు

సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్‌పై ట్విటర్‌ వేదికగా పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీపీఏలపై పునఃసమీక్ష మంచిది కాదని కేంద్ర ఇంధన శాఖ చెప్పిందని చంద్రబాబు గుర్తు చేశారు. అలాచేస్తే ఏపీకి పెట్టుబడులు దూరమవుతాయని ఇంధన శాఖ కార్యదర్శి, కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి చెప్పినా సీఎం జగన్‌ వినలేదని విమర్శించారు. ఇప్పుడు జపాన్‌ రాయబార కార్యాలయం కూడా భారత్‌కు లేఖ రాసిందన్నారు. జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులో ఉంటే.. మిగతా సగం జగన్‌ చేసే పనుల్లో ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం దాటి, దేశం దాటి, ప్రపంచమంతా హితవాక్యాలు చెబుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. బహుశా ఇలా చెప్పించుకోవడమూ వాళ్లకు గర్వంగా ఉందేమో! అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు