close

తాజా వార్తలు

జాన్వి డ్రైవర్‌ వద్ద అప్పు తీసుకుని మరీ..!

వీడియో వైరల్
‘శ్రీదేవి గర్వపడుతుంటారు’ నెటిజన్ల ప్రశంసలు

ముంబయి: శ్రీదేవి కుమార్తె, కథానాయిక జాన్వి కపూర్‌ తన మంచి హృదయంతో నెటిజన్ల మనసులు దోచుకున్నారు. ఆమె జిమ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న మార్గంలో ఓ బాలుడు  వెంటపడ్డాడు. జాన్వి కారు ఎక్కడానికి వెళ్తుండగా.. తన వద్ద ఉన్న మ్యాగజైన్‌ కొనమంటూ బాలుడు బతిమలాడాడు. దీంతో ఆమె కారులో ఉన్న తన పర్సు తీసి, డబ్బుల కోసం చూశారు. కానీ ఆమె వద్ద లేకపోవడంతో డ్రైవర్‌ను అప్పు అడిగారు. అతడు ఇచ్చిన డబ్బుల్ని బాలుడికి ఇచ్చి, బాయ్‌ చెప్పి పంపారు.

ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు జాన్విపై ప్రశంసల జల్లు కురిపించారు. తల్లి లక్షణాల్ని పుణికి పుచ్చుకుందని, శ్రీదేవి కూడా ఇలానే దయతో, వినయంతో వ్యవహరించేవారని, ఇప్పుడు అతిలోక సుందరి స్వర్గం నుంచి ఇవన్నీ చూస్తూ గర్వపడుతుంటారని.. మెచ్చుకుంటున్నారు. మంగళవారం శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు