close

తాజా వార్తలు

మూడో వన్డే: బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌, భారత్ మూడో వన్డేకు వేళైంది. టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో 0-1తో వెనకబడిన ఆ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు భారత్‌ గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ఉంది. కుల్‌దీప్‌ యాదవ్‌ స్థానంలో యుజువేంద్ర చాహల్‌ జట్టులోకి వచ్చాడని విరాట్‌ వెల్లడించాడు.

భారత్‌: శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ (సారథి), రిషభ్‌పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌, మహ్మద్‌ షమి, యుజువేంద్ర చాహల్‌, ఖలీల్‌ అహ్మద్‌

విండీస్‌: క్రిస్‌గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, షై హోప్‌, హెట్‌మైయిర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ చేజ్‌, జేసన్‌ హోల్డర్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, ఫాబియన్‌ అలెన్‌, కీమర్‌ రోచ్‌, కీమో పాల్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు