close

తాజా వార్తలు

నెటిజన్లను ఆకట్టుకుంటున్న కానిస్టేబుల్‌ పాట..!

దిల్లీ: ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ తన గానంతో నెటిజన్ల హృదయాల్ని ఆకట్టుకున్నారు. లవ్లీసింగ్‌ అనే ఐటీబీపీ విభాగానికి చెందిన కానిస్టేబుల్‌ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరిహద్దు సైనికులకు సంబంధించిన పాట పాడి దేశభక్తిని చాటారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఐటీబీపీ విభాగం తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

1997లో విడుదలైన ‘బోర్డర్‌’ సినిమాలోంచి దేశభక్తిని పెంపొందించే ‘సందేషే ఆతే హై’ అనే పాటను లవ్లీసింగ్‌ పాడారు. ఈ పాటను భారత 73వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా తన సహోద్యోగులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాటను ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా కొద్ది గంటల్లోనే వేల లైక్స్‌ సంపాదించి వైరల్‌గా మారింది. అద్భుతంగా పాటను పాడావని పలువురు నెటిజన్లు లవ్లీసింగ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. దీనిపై ఒక నెటిజన్‌ స్పందిస్తూ.. మీరు పాడిన ఈ పాటను ప్రముఖ సింగర్‌ సోనూ నిగమ్‌ వింటే ఎంతో గర్విస్తాడని అన్నారు.

 



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు