close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సోదరికీ కావాలి స్వాతంత్య్రం

కళ్లుమూసుకుపోయిన మృగాల నుంచి...
తొమ్మిది నెలల పసిపాపలకు!
ఒళ్లు తెలియని కామాంధుల నుంచి..

ముక్కుపచ్చలారని ఐదేళ్ల బాలికలకు!
శరీరాలు మరిగిన చీడపురుగుల నుంచి..

ప్రపంచం పోకడ తెలియని అమ్మాయిలకు!
వెంటాడి... వేధించే దుర్మార్గుల నుంచి...

చెల్లెళ్లందరికీ స్వాతంత్య్రం కావాలి...

ఇందుకు అన్నలందరూ
తోడు రావాలి.ప్రేమ ముసుగేసుకున్న

తోడేళ్ల నుంచి అమాయక ఆడపిల్లలకు!
ఫేస్‌బుక్‌ వల వేస్తున్న స్మార్ట్‌కేడీల నుంచి నేటి మహిళలకు!
వీధి చివరన కామెంట్ల కోరలు చాచే

పాముల నుంచి సాధారణ గృహిణులకు!
కార్యాలయాల్లో కాటేయడానికి కాచుకున్న

తాచుల నుంచి పనేలోకంగా బతికే ఉద్యోగినులకు!
ఈ అక్కలందరికీ స్వాతంత్య్రం కావాలి...

ఇందుకు తమ్ముళ్లందరూ  అండగా నిలవాలి.
అడుగడుగునా అన్నాతమ్ముళ్లై...అక్కాచెల్లెళ్లుగా ఆదరిస్తే...‘భారతీయులందరూ నా సహోదరులు’ అని ప్రమాణం చేసిన భారత చెల్లి రాఖీ జెండా ఎగరేస్తుంది.స్వాతంత్య్రాన్ని ‘రక్షాబంధన్‌’లా వేడుక చేస్తుంది.


మరిన్ని