close

సినిమా

అందం కాదు... ప్రతిభే ముఖ్యం

‘కొబ్బరిమట్ట... హృదయకాలేయం కలిపి మరో సినిమా చేయాలనేంత ఉత్సాహాన్నిచ్చిందీ విజయం’’ అన్నారు సాయిరాజేష్‌. ఆయన నిర్మించిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. సంపూర్ణేష్‌బాబు కథానాయకుడు. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకుడు. ఇటీవలే విడుదలైందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించింది. అతిథిగా హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘‘ప్రతిభ ఉంటే చాలు.. అందమా మరొకటా అని కాదు. ఇంకో విజయం వస్తే సంపూ కంటే అందగాడు మరొకరు ఉండరు’’అన్నారు. కార్యక్రమంలో మహేష్‌ కత్తి, ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శీను తదితరులు పాల్గొన్నారు.

రూ.2 లక్షల విరాళం: కర్ణాటక వరద బాధితుల సహాయార్థం రూ.2 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు ట్విటర్‌ ద్వారా తెలిపారు సంపూర్ణేష్‌బాబు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు