close

సినిమా

‘ఎవరు’ ఆ జాబితాలో చేరుతుంది

‘‘తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల ‘జెర్సీ’, ‘బ్రోచేవారెవరురా’, ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’.. ఇలా మంచి సినిమాలు చాలానే వచ్చాయి. ఆ జాబితాలో ‘ఎవరు’ కూడా భాగం అవుతుందనే నమ్మకం మాకుంది’’ అన్నారు నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి. ఆయన నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మాతలు. ఈ 15న విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం ముందస్తు విడుదల వేడుక జరిగింది. అడివి శేష్‌ మాట్లాడుతూ ‘‘పరిశ్రమకి సంబంధం లేని వెయ్యి మందికి చూపించి, వాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకొని ఈ సినిమాని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దామ’’న్నారు. కార్యక్రమంలో  శ్రీచరణ్‌ పాకాల, రెజీనా, వంశీ, నవీన్‌చంద్ర, వెంకట్‌ రామ్‌జీ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు