close

సినిమా

రాక్షసుడుకి కథే హీరో

‘‘మా అబ్బాయిని ఒక స్టార్‌ కథానాయకుడిగా చూడాలనుకొన్నా. ఆ ప్రణాళిక మేరకే అధిక నిర్మాణ వ్యయంతో సినిమాలు చేశా. ఇప్పుడు తనకంటూ ఓ మార్కెట్‌ ఏర్పడింది’’ అన్నారు బెల్లంకొండ సురేష్‌. ఆయన తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన ‘రాక్షసుడు’ ఇటీవలే విడుదలైంది. చిత్ర విజయంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల   సమావేశాన్ని నిర్వహించారు. బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ‘‘ఒక   సినిమాకి కథే హీరో అయితే దాని ఫలితం ఎలా ఉంటుందో ‘రాక్షసుడు’ నిరూపించింది. ఈ నెల 15  నుంచి విజయయాత్ర నిర్వహించబోతున్నాం. కాస్త ఆలస్యమైనా తదుపరి మంచి కథతోనే సాయి శ్రీనివాస్‌ ప్రేక్షకుల ముందుకొస్తాడు. త్వరలో మా అబ్బాయి పెళ్లికి సంబంధించి శుభవార్త చెప్పబోతున్నాం’’ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘సినిమా విడుదలైన పదో రోజుకే పంపిణీదారులు, ప్రదర్శనకారులు లాభాల్లోకి రావడం ఆనందంగా ఉంది. పాత్ర పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేయాల్సి వచ్చింది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘తొలి వారం కంటే రెండో వారంలో సినిమాకి మరింత ఆదరణ లభిస్తోంది. సాయి శ్రీనివాస్‌ ఈ చిత్రంతో ఉత్తమ నటుడు అనిపించుకొన్నాడ’’న్నారు. ఈ కార్యక్రమంలో మల్టీడైమన్షన్‌ వాసు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు