close

బిజినెస్‌

పెన్నార్‌ లాభం రూ.16.5 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ తొలి త్రైమాసికంలో రూ.16.51 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన లాభం రూ.13.13 కోట్లతో పోలిస్తే ఇది 25.8శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.538.20 కోట్ల నుంచి రూ.541.36 కోట్లకు చేరుకుంది. కొత్త ఆర్డర్లతో పాటు, పాత ఖాతాదారులూ వస్తుండండంతో మంచి వృద్ధి రేటు నమోదవుతోందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఇది కొనసాగుతుందని విశ్వసిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు