close

బిజినెస్‌

కావేరీ సీడ్స్‌కు అమ్మకాల అండ

ఈనాడు, హైదరాబాద్‌: కావేరీ సీడ్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.72 శాతం వృద్ధితో రూ.228.93 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత మొదటి త్రైమాసికానికి రూ.655.46 కోట్ల ఆదాయం నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.581.89 కోట్లు ఉంది. ఈ మొదటి త్రైమాసికంలో పత్తి విత్తనాల అమ్మకాలు 13 శాతం, మొక్కజొన్న విత్తనాల అమ్మకాలు 12 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. హైబ్రీడ్‌ వరి విత్తన అమ్మకాలు 53 శాతం పెరిగాయి. ‘కేపీహెచ్‌ 468’ అనే నూతన హైబ్రీడ్‌ వరి వంగడాన్ని ప్రవేశపెట్టినట్లు దీనివల్ల అధిక అమ్మకాలు సాధించగలిగినట్లు కంపెనీ పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు