close

బిజినెస్‌

రాణించిన సన్‌ ఫార్మా

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సన్‌ ఫార్మా రూ.1,387.48 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.1,057.29 కోట్లతో పోలిస్తే ఇది 31.23 శాతం ఎక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.7,224.17 కోట్ల నుంచి రూ.8,374.36 కోట్లకు పెరిగింది. జపాన్‌కు చెందిన పోలా ఫార్మా ఈ ఏడాది జనవరి 1 నుంచి సన్‌ ఫార్మాకు అనుబంధ సంస్థగా మారిన నేపథ్యంలో ఈ ఫలితాలను క్రితం ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసిక ఫలితాలతో పోల్చి చూడలేమని కంపెనీ పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు