close

బిజినెస్‌

అపోలో హాస్పిటల్స్‌ లాభం రెట్టింపు

ఈనాడు, హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం ఏప్రిల్‌-జూన్‌లో రూ.49.15 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో నమోదైన రూ.23.34 కోట్ల నికరలాభంతో పోల్చితే ఈసారి లాభం దాదాపు రెట్టింపు అయినట్లు స్పష్టమవుతోంది. ఈ మొదటి త్రైమాసికానికి అపోలో హాస్పిటల్స్‌ ఆదాయం రూ.2,571.89 కోట్లు ఉంది. ఏడాది క్రితం ఇదేకాలంలో ఆదాయం రూ.2,210.47 కోట్లు మాత్రమే. మొదటి త్రైమాసికానికి ఆసక్తికరమైన పనితీరు కనబరచినట్లు, అన్ని విభాగాల్లో మెరుగైన ఆదాయాలు నమోదు చేసినట్లు అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు