close

బిజినెస్‌

ఐఓసీ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు!

వచ్చే 5-7 ఏళ్లలో.. సామర్థ్య విస్తరణ దిశగా అడుగులు

దిల్లీ: దేశంలోనే అతి పెద్ద చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) వచ్చే 5-7 ఏళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు ఆ సంస్థ ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ వెల్లడించారు. చమురు శుద్ధి, పెట్రో రసాయనాల విభాగాన్ని విస్తరించి విపణిలో అగ్ర స్థానంలో కొనసాగాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. చమురు శుద్ధి వార్షిక సామర్థ్యాన్ని ప్రస్తుత 80.7 మిలియన్‌ టన్నుల నుంచి 150 మిలియన్‌ టన్నులకు చేర్చబోతున్నారు. ఇంధనం, ఎల్‌పీజీ రిటైలింగ్‌ నెట్‌వర్క్‌ను, పెట్రో రసాయనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని, ముడిచమురు, సహజ వాయువు ఉత్పత్తిని కూడా పెంచబోతున్నారు. పెట్రో రసాయనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా ప్రస్తుత 3.15 మిలియన్‌ టన్నుల నుంచి ఏడాదికి 13 మిలియన్‌ టన్నులకు చేర్చాలని భావిస్తోంది. సహజ వాయువు రిటైలింగ్‌లోనూ విస్తరణ దిశగా అడుగులు వేయనుంది. ఇందుకోసం వచ్చే 8 ఏళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వార్షిక నివేదిక వెల్లడించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు