close

బిజినెస్‌

బజాజ్‌ పల్సర్‌ 125 నియో బైక్‌

ధర రూ.64,000 నుంచి

దిల్లీ: కొత్త బైక్‌ పల్సర్‌ 125 నియోను బజాజ్‌ ఆటో మంగళవారం ఆవిష్కరించింది. 125 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ డ్రమ్‌ / డిస్క్‌ బ్రేక్‌లతో లభిస్తుందని సంస్థ తెలిపింది. డ్రమ్‌ బైక్‌ ధర రూ.64,000 కాగా, డిస్క్‌ బ్రేక్‌ రూ.66,618 (ఎక్స్‌ షోరూం, దిల్లీ) అని వివరించింది. ప్రీమియం బైక్‌లను ఇష్టపడేవారికి ఈ స్పోర్టీ మోటార్‌సైకిల్‌ను డిజైన్‌, ధరల పరంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ సారంగ్‌ కనాడే తెలిపారు. 5 గేర్‌లు కలిగిన ఈ బైక్‌కు ప్రైమరీ కిక్‌ ఉంటుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు