close

క్రీడలు

పాకిస్థాన్‌లో ఆడలేం 

తటస్థ వేదికలో నిర్వహించండి 
ఐటాకు ఆటగాళ్ల సూచన

దిల్లీ: పాకిస్థాన్‌లో జరగాల్సిన డేవిస్‌ కప్‌ పోరును తటస్థ వేదికకు మార్చాలని భారత ఆటగాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో భారత టెన్నిస్‌ సమాఖ్య (ఐటా) చొరవ చూపాలని కోరుతున్నారు. సెప్టెంబర్‌ 14, 15 తేదీల్లో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఆసియా ఓసియానియా గ్రూప్‌ వన్‌ పోరులో పాక్‌తో భారత్‌ తలపడాలి. అయితే జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు వెళ్లడంపై భారత ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘‘తటస్థ వేదికలో నిర్వహించాలని మేం ఐటాను కోరాం’’ అని డేవిస్‌ కప్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి చెప్పాడు. ఈ విషయంలో ఐటా వ్యవహరిస్తున్న తీరును కూడా కొందరు ఆటగాళ్లు తప్పు పడుతున్నారు. భద్రతా ఏర్పాట్లను మరోసారి తనిఖీ చేయాలని మాత్రమే ఐటా.. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్యను కోరిందని, వేదిక మార్పు విషయంలో ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు