close

క్రీడలు

ఛాంప్స్‌ శ్రీనివాస్‌, అపూర్వ 

ప్రశాంత్‌ రనాడె స్మారక రాష్ట్రస్థాయి క్యారమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశాంత్‌ రనాడె స్మారక తెలంగాణ రాష్ట్రస్థాయి క్యారమ్‌ టోర్నీలో శ్రీనివాస్‌ (ఐఓసీఎల్‌), అపూర్వ (ఎల్‌ఐసీఐ) ఛాంపియన్లుగా నిలిచారు. రామ్‌కోఠిలోని మహారాష్ట్ర మండలిలో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో శ్రీనివాస్‌ 25-11, 25-13తో ఆదిత్యపై నెగ్గాడు. సెమీస్‌లో శ్రీనివాస్‌ 25-24, 21-7తో హకీం (బీఎస్‌ఎన్‌ఎల్‌)పై, ఆదిత్య 10-20, 25-4, 20-19తో నరేశ్‌పై గెలిచారు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అపూర్వ 15-9, 18-17తో కార్తీక వర్ష (నాసర్‌)పై విజయం సాధించింది. సెమీస్‌లో అపూర్వ 25-15, 25-8తో జయశ్రీ (ఐఓసీఎల్‌)పై, కార్తీక వర్ష 25-9, 17-15తో నందిని (ఆవాస)పై గెలుపొందారు. జూనియర్‌ బాలుర ఫైనల్లో సాయిచరణ్‌ (మంచిర్యాల) 25-0, 20-8తో సాయి ఈశ్వర్‌ (వి-10)పై నెగ్గాడు. సెమీస్‌లో సాయిచరణ్‌ 21-3, 23-16తో జశ్వంత్‌ (ఆవాస)పై, సాయి ఈశ్వర్‌ 22-16, 20-13తో సందీప్‌పై గెలిచారు. జూనియర్‌ బాలికల ఫైనల్లో శ్రేయసపై కార్తీక వర్ష విజయం సాధించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు