close

క్రీడలు

ఆసియా అథ్లెట్స్‌ కమిషన్‌లో ఉష

దిల్లీ: భారత దిగ్గజ స్ప్రింటర్‌ పీటీ ఉషకు ఆసియా అథ్లెటిక్స్‌ సంఘం (ఏఏఏ) అథ్లెట్స్‌ కమిషన్‌లో సభ్యురాలిగా నియమితురాలైంది. ఆసియా స్థాయిలో ఉష సాధించిన ఘనతలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. 1992 ఒలింపిక్స్‌ స్వర్ణ విజేత హ్యామర్‌ త్రోయర్‌ ఆండ్రీ అబ్దువాలియెవ్‌ నేతృత్వంలోని మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. ‘‘ఏఏఏ అథ్లెట్స్‌ కమిషన్‌లో సభ్యురాలిగా నియామకాన్ని అంగీకరించా. ఇది నాకు, దేశానికి గొప్ప గౌరవం’’ అని పీటీ 55 ఏళ్ల ఉష వ్యాఖ్యానించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు