close

క్రీడలు

ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాలు లేవు

ముంబయి: జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) అధిపతిగా ఎంపికైన రాహుల్‌ ద్రవిడ్‌ విషయంలో ఎలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవని బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) స్పష్టం చేసింది. ఈ విషయంలో అంబుడ్స్‌మన్‌ డి.కె.జైన్‌కు ఎలాంటి అభ్యంతరాలున్నా, వాటికి వివరణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది ‘‘రాహుల్‌ విషయంలో విరుద్ధ ప్రయోజనాలు లేవు. అభ్యంతరాలున్నాయని అంబుడ్స్‌మన్‌ భావిస్తే.. వివరణ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత అంబుడ్స్‌మన్‌ నిర్ణయం తీసుకుంటారు’’ అని సీఓఏ కొత్త సభ్యుడు రవి తొగ్డె తెలిపాడు. ఎన్‌సీఏ పదవిలో ఉంటూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమానిగా ఉన్న ఇండియా సిమెంట్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా ద్రవిడ్‌ కొనసాగడంపై అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు అందింది. అయితే ఎన్‌సీఏ పదవిలో కొనసాగుతున్న సమయంలో ఇండియా సిమెంట్స్‌కు ద్రవిడ్‌ సెలవు పెడుతున్నాడని, కాబట్టి విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి రాదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు