close

క్రీడలు

భారత్‌ పీఠానికి ముప్పు! 

టెస్టుల్లో నం.1పై కివీస్‌ కన్ను 
శ్రీలంకతో సిరీస్‌ నేటి నుంచే

గాలె: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానమే లక్ష్యంగా న్యూజిలాండ్‌ జట్టు శ్రీలంకతో పోరుకు సిద్ధమెంiది. శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ బుధవారమే కొలంబోలో ఆరంభం కానుంది. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 113 పాయింట్లతో అగ్రస్థానంతో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌ 109 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తే కివీస్‌ 115 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. అయితే త్వరలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-0తో నెగ్గితే తిరిగి అగ్రస్థానం కైవసం చేసుకుంది. గత నెలలో వన్డే ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌.. ఆ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే కావడంతో ఆ జట్టు ప్రదర్శనపై అందరూ ఆసక్తితో ఉన్నారు. రోజు రోజుకూ బలహీనపడుతున్న శ్రీలంక.. విలియమ్సన్‌ బృందాన్ని ఏమేరకు కాచుకుంటుందన్నది సందేహమే. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి నంబర్‌వన్‌ ర్యాంకును చేజిక్కించుకోవడానికి కివీస్‌కు మంచి అవకాశాలే ఉన్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు