close

గ్రేటర్‌ హైదరాబాద్‌

ఇంకుడు గుంత.. భావితరాల నిశ్చింత

హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు పడిపోతున్న భూగర్భజలాలను పెంచేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంకుడు గుంతలు తవ్వేందుకు ప్రాధాన్యమిస్తోంది. వివిధ ప్రాంతాల్లో 74 ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది. వర్షాలు పడిన సమయంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతమైన రాజ్‌భవన్‌ సమీపంలోని లేక్‌వ్యూ అతిథి గృహం వద్ద రహదారి పక్కన అధునాతన పద్ధతుల్లో ఇంకుడు గుంతను నిర్మిస్తున్నారు. అక్కడ నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా చూట్టూ రంధ్రాలు ఉన్న రెండు పైపులు ఉంచారు. తద్వారా త్వరగా నీరు భూమిలోకి ఇంకుతుంది. ప్రస్తుతం 10 ఇంకుడు గుంతల నిర్మాణం తుది దశకు చేరిందని అధికారులు పేర్కొన్నారు.

 -ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు