close

గ్రేటర్‌ హైదరాబాద్‌

సీఏ ఫైనల్‌లో రాణించిన రాధాలక్ష్మి

సీఏ ఫౌండేషన్‌లో శ్రీకాకుళం విద్యార్థికి 2వ ర్యాంకు

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: ప్రతిష్ఠాత్మక సీఏ తుది పరీక్షల్లో (పాత సిలబస్‌) హైదరాబాద్‌కు చెందిన వీపీ రాధాలక్ష్మి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. మొత్తం 800 మార్కులకు 633 మార్కులు సాధించారు. మే, జూన్‌ నెలల్లో జరిగిన సీఏ ఫైనల్‌ (పాత, కొత్త సిలబస్‌)తోపాటు సీఏ ఫౌండేషన్‌ పరీక్షల ఫలితాలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) మంగళవారం విడుదల చేసింది. చైన్నెకి చెందిన రాధాలక్ష్మి కుటుంబం 18 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తోంది. ఆమె తండ్రి కూడా ఛార్టర్డ్‌ అకౌంటెంటే కావడం విశేషం. మరోవైపు సీఏ ఫౌండేషన్‌ కోర్సులో శ్రీకాకుళం విద్యార్థి కాళీవరపు సాయి శ్రీకర్‌ మొత్తం 400 మార్కులకు 344 సాధించి రెండో స్థానంలో నిలిచాడు.

ఫలితాల వివరాలివీ.. 
సీఏ ఫైనల్‌ పాత సిలబస్‌ పరీక్షకు మొత్తం 93,656 మంది హాజరు కాగా, 10,816 మంది ఉత్తీర్ణులయ్యారు. 
సీఏ ఫైనల్‌ కొత్త సిలబస్‌ పరీక్షకు 29,049 మంది రాయగా, 3,369 మంది పాసయ్యారు. 
సీఏ ఫౌండేషన్‌ పరీక్షకు 30,971 మంది హాజరయ్యారు. వారిలో 5,753 మంది(18.58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత 18.47 శాతంకాగా అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 18.72.

ఆనందంగా ఉంది 
‘‘సీఏ ఫౌండేషన్‌లో రెండో ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంజినీరింగ్‌, నిట్‌లో మంచి ర్యాంకు వచ్చిన చేరలేదు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కుటుంబానికి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో సీఏను ఎంపిక చేసుకున్నాను. సీఏ పూర్తి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నాను’’.

- శ్రీకర్‌, శ్రీకాకుళం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు