close

గ్రేటర్‌ హైదరాబాద్‌

రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. బుధవారానికి అల్పపీడనం మరింత తీవ్రం కానుంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. తెలంగాణ ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో అతి భారీ కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయన్నారు. మంగళవారం పగలు రాష్ట్రంలో 164 ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అత్యధికంగా మధిరలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు