close

క్రైమ్

పరారైన 26 ఏళ్లకు పట్టుబడ్డాడు!

మహారాష్ట్రలో దొరికిన ఆదిలాబాద్‌ జిల్లా నిందితుడు

ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి పరారైన 26 ఏళ్లకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. 1989 నవంబర్‌ 15న జరిగిన హత్యలో ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌కు చెందిన భిచ్చేయాదవ్‌రావు ఏ4 నిందితుడు. మావోయిస్టులతో కలసి హత్యలో పాల్గొన్నాడని కేసు నమోదు చేశారు. ఆ సమయంలో ఆయన వయసు 42 సంవత్సరాలు. 1991లో అరెస్టు అయిన అతనిపై పోలీసులు 15.01.1993న ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. బెయిలుపై బయటకు వచ్చిన భిచ్చేయాదవ్‌ ఆ తర్వాత పరారయ్యాడు. అప్పటి నుంచి పోలీసులు వెతుకుతూనే ఉన్నా ఆచూకీ లభించకపోవడంతో దీన్ని లాంగ్‌ పెండింగ్‌ కేసు (ఎల్‌పీసీ)గా ఉంచారు. పరారైన 26 ఏళ్లకు తాజాగా భిచ్చేయాదవ్‌ ఆచూకీ దొరికింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా హర్ధాపూర్‌లో కూలీగా పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడని ఇంద్రవెల్లి పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడి నుంచి ఇటీవల అరెస్టు చేసి తీసుకొచ్చిన పోలీసులు నిందితుడిని జైలుకు పంపించారు. ప్రస్తుతం ఆయన వయసు 72 సంవత్సరాలు. నడివయసులో ఉన్నప్పుడు పరారై వృద్ధాప్యంలో పట్టుబడటంతో పురాతన కేసును తిరగదోడే పనిలో పోలీసులు ఉన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు